బిగ్ బాస్ మనీతో రాహుల్‌ ఏం చేయబోతున్నాడో తెలుసా ?

524
rahul sipligunz
- Advertisement -

105 రోజుల పాటు సాగిన బుల్లి తెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్‌ 3 విన్నర్‌గా నిలిచారు హైదరాబాద్‌కు చెందిన రాహుల్ సిప్లిగంజ్‌. 15 మంది కంటెస్టెంట్‌ల పోటీని తట్టుకుని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రాహుల్‌…చిరు చేతుల మీదుగా బిగ్ బాస్ విన్నర్ అవార్డును అందుకున్నారు. బిగ్ బాస్‌ విన్నర్‌గా రాహుల్‌ రూ. 50 లక్షలు గెలుచుకున్నాడు.

ఈ డబ్బుతో ఏం చేస్తావని రాహుల్‌ని అడగగా ఈ డబ్బుతో ఓ బార్బర్ షాప్ పెడతా.. నాకు పాటలు పాడటం కంటే కూడా నా కులవృత్తి అంటే ఇష్టం. ఆ పనిచేయడానికి గర్వపడతా అని చెప్పాడు.

దీంతో పాటు అద్దె ఇంటి నుంచి కొత్త ఇంటికి తన తల్లిదండ్రుల్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నానని చెప్పాడు. అయితే రూ.50లక్షలతో హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ కొనడం కష్టంతో కూడుకున్న పని కాబట్టి, మరో కోటి సంపాదిస్తే కానీ తనకు నచ్చిన ఏరియాలో ఇల్లు కొనలేనని చెప్పుకొచ్చాడు రాహుల్.

- Advertisement -