సముద్ర తీరంలో శ్రీముఖి సిందులు.. వీడియో

393
srimukhi

‘పటాస్’ షో ద్వారా రోజూ టీవీల్లో కనిపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయ్యింది శ్రీముఖి. ఆ షోకు శ్రీముఖి యాంకరింగ్, ఆమె అందాలే పెద్ద అస్సెట్‌గా నిలుస్తూ వచ్చాయి. ఇక ఇటీవలే ముగిసిన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి. అయితే బిగ్‌బాస్‌ ముగిసి వారం గడిచింది. కంటెస్టెంట్ల పార్టీలు, ఇంటర్వ్యూలు రోజుకొకచోట జరుగుతూనే ఉన్నాయి. కానీ శ్రీముఖి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

Sreemukhi Enjoys Maldives

ఇక ఈ అమ్మడు బిగ్‌బాస్‌ పూర్తికాగానే ఎంచక్కా మాల్దీవుల టూర్‌కు చెక్కేసింది. సముద్ర తీరంలో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేస్తోంది. ఈ ట్రిప్‌లో ఆమెతో పాటు ఆర్జే చైతూ, యాంకర్‌ విష్ణుప్రియ పలువురు స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

బిగ్ బాస్ షో జరుగుతున్న సందర్భంలో శ్రీముఖిని.. ‘మీరు బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిలిచి రూ.50 లక్షలు మీ సొంతమైతే..ఏం చేస్తారు’ అని నాగార్జున ప్రశ్నించగా.. అన్నీ పేరెంట్స్‌కు ఇస్తానని సమాధానమిచ్చింది. అంతేగాక తనకెంతో ఇష్టమైన మాల్దీవులకు వెళ్తానని శ్రీముఖి చెప్పుకొచ్చింది. అయితే ఇందులో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. అయినప్పటికీ, ఆమె మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తోంది.