పవన్ – రానా…బీమ్లా నాయక్‌

126
pawan

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ మేరకు పవన్‌ ఫోటోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. బీమ్లానాయక్‌ తిరిగి డ్యూటీలో చేరాడు అని వెల్లడించగా పవన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ షెడ్యూల్‌లో పవర్‌స్టార్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, తర్వాత రానా, పవన్ కళ్యాణ్ మధ్య క్లైమాక్స్ సీన్స్ పూర్తి చేయనున్నారు. రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో “అయ్యప్పనమ్ కోషియం” తెలుగు రీమేక్ మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రం 2022లో సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది.

పవన్‌కు జంటగా నిత్యా మీనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.