టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు..

321
trs
- Advertisement -

టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే వుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భీమ్గల్ మండలానికి చెందిన నిజామాబాద్ జిల్లా యువ నాయకుడు జక్కుల కార్తీక్,పలువురు మండల నాయకులు ఇవాళ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కార్తీక్‌తో పాటు పలువురికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేష్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి అధికారిక నివాసంలో భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన భీంగల్ మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవడానికి ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నామని.. మున్సిపల్ శాఖామంత్రి కెటిఆర్ సహకారంతో సిసి రోడ్లు,డ్రైన్లు,బిటి రోడ్లు,వైకుంఠ ధామాలు,ఓపెన్ జిమ్ పార్కులు,సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు.ఇప్పటికే మొదలైన పనులు నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -