25న భారత్ బంద్..

91
- Advertisement -

కుల ఆధారిత ఓబీసీ జనగణనను కేంద్రం నిర్వహించకపోవడానికి నిరసనగా ఆ నెల 25న భారత్ బంద్ కు ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది.ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, రైతులకు కనీస మద్దతు ధర, పాత పెన్షన్ విధానం అమలుతో పాటు పలు డిమాండ్లతో నిర్వహిస్తున్న బంద్‌లో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చింది.

పర్యావరణ పరిరక్షణ పేరుతో గిరిజన నిర్వాసితులకు వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలు ఆపాలని.. టీకాపై బలవంతపు ఒత్తిడి ఉండవద్దని, లాక్‌డౌన్‌లో రహస్యంగా కార్మికులపై చేసిన కార్మిక చట్టాలను తీసేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. 25న తాము చేపట్టబోయే బంద్ కు మద్దతుగా వ్యాపారాలు, ప్రజా రవాణాను మూసివేయాలని కోరారు.

- Advertisement -