కేసీఆర్ పాలన స్వర్ణయుగం

17
- Advertisement -

కేసీఆర్ పరిపాలన కాలం రాష్ట్రంలోని రైతులకు సువర్ణ యుగం వంటిదని, అన్నదాతలు ఆనందంగా రోజులు గడిపారని చెప్పారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. సూర్యాపేట నుండి వరంగల్ సభకు రైతులు ర్యాలీగా బయలుదేరగా రాయపర్తి మండల కేంద్రానికి చేరుకున్న ఎడ్లబండ్లకు ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఘన స్వాగతం పలికారు.

కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఉద్యమ రథసారథి కేసీఆర్ దృష్టికి తేవాలన్న తలంపుతోనే వరంగల్‌కు సుదూర ప్రాంతమైన సూర్యపేట జిల్లా నుండి అన్నదాతలు స్వచ్ఛందంగా 16 ఎడ్లబండ్లతో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎల్కతుర్తి సభకు ర్యాలీగా వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎడ్లబండ్ల ర్యాలీ సాయంత్రం 4 గంటలకు రాయపర్తి నుండి వరంగల్ వైపుకు బయలుదేరుతుందని తెలిపారు.

గత 17 నెలల కాంగ్రెస్ పరిపాలన కాలంలో రాష్ట్రంలోని రైతాంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. సాగు జలాలు సమృద్ధిగా లేక, అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు ఆరుగాలం కష్టించి సాగు చేసుకున్న పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:ఆపరేషన్ కగార్..మావోలకు దడ!

- Advertisement -