జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి దిశా పటానీ సోదరి , మాజీ భారత సైనిక అధికారి అయిన ఖుష్బూ పటానీ తీవ్రంగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసిన ఖుష్భూ.. భారత సైన్యంలో ఉన్నపుడు రెండు సంవత్సరాలు కాశ్మీర్‌లోని పహల్గామ్‌ను చూశాను. అక్కడి ప్రతి మూల తనకు తెలుసు అన్నారు. ఇది ఖచ్చితంగా ఉగ్రదాడి కాదు – ఇది పాకిస్తాన్ ఆర్మీ కుతంత్రం అని ఆరోపించారు.
పాకిస్తాన్‌పై యుద్ధం అనేది చివరి ఆప్షన్ అనుకుంటారు ఇప్పుడు ఆ సమయంలోకి వచ్చేశాం… గత 75 ఏళ్లుగా మనం ఈ పాకిస్తానీ మూకలను తట్టుకుంటూ వస్తున్నాం. ఇక చాలుపోయింది. ఇది ఎంత పెద్ద దాడి జరిగిందంటే, పాకిస్తాన్ ఆర్మీ ప్రమేయం లేకుండా జరగడం అసాధ్యం అని తేల్చిచెప్పారు.
మనం ఎప్పటికి ఇలా ఏర్‌స్ట్రైక్స్ చేయడం, సర్జికల్ అటాక్స్ మీదే ఉండిపోవాలా? ఇప్పుడు ఒక సంపూర్ణ యుద్ధం అవసరం. ఇతర దేశాలు ఎలా తమ దేశాన్ని రక్షించుకునేందుకు గట్టిగా చర్యలు తీసుకుంటాయో, మనం కూడా అదే చేయాలి. ఇజ్రాయెల్ గాజాపై దాడిచేసినట్లుగా, రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించినట్లుగా, ఇప్పుడు భారతదేశం కూడా పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించాలి అని ఆమె వీడియోలో పేర్కొనగా ఈ వీడియో వైరల్‌గా మారింది.
जम्मू कश्मीर:-पहलगाम आतंकी हमले पर पूर्व मेजर खुशबू पाटनी ने कहा- “कबतक हम Air strike करते रहेंगे, एक और उरी होगा
उन्होंने कहा: महाभारत होनी चाहिए#PahalgamTerroristAttack #khushboopatani #Pakistan pic.twitter.com/ewFDNzSfcQ— Prince Kumar 🇮🇳 (@PrinceK51382724) April 24, 2025
Also Read:గేమ్ ఛేంజర్..అందుకే ఫ్లాప్!

