రాష్ట్రానికి వర్ష సూచన

73
rains
- Advertisement -

రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

- Advertisement -