‘మణికర్ణిక’ నుండి ఫస్ట్‌ సాంగ్‌..

259
- Advertisement -

బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ నటించిన `మణికర్ణిక- ది క్వీన్ ఆప్ ఝాన్సీ` చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. రిపబ్లిక్ డే కానుకగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండి ఫస్ట్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘భారత్‌..’ అంటూ సాగుతున్న ఈ పాట దేశ గొప్పతనాన్ని, దేశభక్తి గురించి చాటిచెప్పేలా ఎంతో వినసొంపుగా ఉంది.

Manikarnika

పాటలో కంగన చిన్నప్పుడు కత్తిసాము నేర్చుకోవడం నుంచి పెద్దయ్యాక ఝాన్సీ లక్ష్మీబాయిలా ఎలా మారింది? అన్న సన్నివేశాలను చూపించారు. ఈ పాటలో కంగన ఎంతో అందంగా కనిపిస్తున్నారు. అంతేకాదు ఈస్ట్ ఇండియా కంపెనీపై కత్తి దూసే వీరనారిగా ఝాన్సీ లక్ష్మీ భాయ్ పరాక్రమం అసమానంగా చూపిస్తున్నారన్న తెలుస్తోంది.

శంకర్ ఎహసాన్ లాయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శంకర్ మహదేవన్ ఈ చిత్రానికి సంగీతం పరంగా అన్నీ తానే అయ్యి పని చేశారట. భరత్ పాటకు ప్రసూన్ జోషి లిరిక్స్ అందించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకైనా వెనకాడని ఓ ధీరవనిత పై అద్భుతమైన పాటను రాశారాయన. అంకిత లోఖండే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. క్రిష్ – కంగన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

- Advertisement -