వైఎస్‌ జగన్‌తో కేటీఆర్ భేటీ…

997

వైసీపీ అధ్యక్షుడు,ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగన్ నివాసం లోటస్‌ పౌండ్‌లో జరిగిన ఈ భేటీలో టీఆర్‌ఎస్ ఎంపీలు వినోద్ కుమార్, సంతోష్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, చెవిరెడ్డి హాజరయ్యారు.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదన నేపథ్యంలో జగన్‌తో టీఆర్ఎస్ నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి వచ్చే విషయంపై చర్చలు జరపనున్నట్లు భేటీకి ముందు కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.ఎన్డీఏ, యూపీఏలకు ప్రత్యామ్నాయంపై సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు.