ఎనౌన్స్ మెంట్ లేట్ .. రీజన్ అదే?

16
- Advertisement -

కుర్ర హీరోల్లో బెల్లంకొండ కి సెపరేట్ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా నార్త్ లో ఈ కుర్ర హీరో డబ్బింగ్ కి మంచి క్రేజ్ ఉంది. సరయిన స్ట్రాంగ్ హిట్ లేకపోయినా ఈ హీరో ఆ ఇమేజ్ తోనే ముందుకు సాగుతున్నాడు. అయితే బెల్లంకొండ నుండి సినిమా వచ్చి రెండేళ్ళు దాటింది. అల్లుడు అదుర్స్ తర్వాత ఈ హీరో నుండి సినిమా రాలేదు.

నార్త్ లో తనకి ఉన్న డబ్బింగ్ క్రేజ్ తో వినాయక్ తో ఛత్రపతి హిందీ రీమేక్ తో సినిమా చేశాడు బెల్లంకొండ. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది కానీ ఇంకా రిలీజ్ కి నోచుకోవడం లేదు. ప్రస్తుతం మేకర్స్ థియేటర్స్ లో రిలీజ్ చేయాలా ? లేదా ఓటీటీలో వదలాలా ? అనే ఆలోచనలో ఉన్నారు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా మరో సినిమా ఫైనల్ చేసుకున్నాడు. భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కే చంద్రతో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ఇవ్వాలంటే ఛత్రపతి రీమేక్ సంగతేంటి ? అని మీడియా అలాగే జనాలు మాట్లాడుకుంటారేమో అని ఆలోచిస్తున్నాడు. సొ ఛత్రపతి రీమేక్ రిలీజ్ డేట్ వచ్చేవరకు తన కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేని పరిస్థితిల్లో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -