యూఆర్‌ ఏ ఫైటర్ :బీసీసీఐ

45
- Advertisement -

టీమ్ ఇండియా వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌ త్వరగా కొలుకోవాలని భారత యువ క్రికెటర్లు ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ట్వీటర్ వేదికగా పంచుకున్నారు. ఇందులో భారత క్రికెట్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్ ఇతర యువ క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. రూర్కీ దగ్గరలో కారు ఓవర్ స్పీడ్‌తో పల్టీలు కొట్టి కాలిపోయింది. అయితే అందులో ఉన్న పంత్‌ను స్థానికులు రక్షించిన విషయం తెలసిందే.

ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ…పంత్ త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా పంత్‌ కీలకపాత్ర పోషించాడని రాహుల్‌ ద్రావిడ్ గుర్తు చేశారు. గతేడాది ఆడిన భారత్ టెస్ట్‌్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్ లు చాలా కీలకమైనవిగా అభివర్ణించారు. ఈ వీడియోలో స్టార్ ఆల్‌రౌండర్‌ హర్ధిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ యుజ్‌వేంద్ర చాహల్‌ ఇషాన్ కిషన్‌ శుభ్‌మన్ గిల్ కూడా మాట్లాడుతూ పంత్ త్వరగా కోలుకోవాలని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

రిషబ్ పంత్‌కు తీవ్రగాయాలు..

శిఖర్ హెచ్చరిక…పంత్ మెల్లగా నడుపు

సియాచిన్‌పై శివంగి ఆన్‌ డ్యూటీ…

- Advertisement -