ఆ ఆసక్తి లేదంటున్న హీరోయిన్ !

130
- Advertisement -

గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి పై ఇప్పటికే ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. మరోపక్క త‌న ప్రేమ‌క‌థ‌ల‌తో ప‌లు సార్లు వార్త‌ల్లో నిలిచినా.. ఇలియానా మాత్రం ఏ ప్రేమ కథను సీరియస్ గా తీసుకోలేదు. పైగా పెళ్లి పట్ల ఇలియానా ఒకింత విముఖ‌త‌తో స్పందించింది. ప్ర‌స్తుతం కూడా ఇలియానా, హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడితో ఒక ప్రేమ క‌థ‌ను న‌డిపిస్తూ ఉంది. ఈ త‌రుణంలో పెళ్లి ఆలోచ‌న ఉందా? అంటే.. ఈ ప్రశ్న అడిగిన మీడియా పై ఇలియానా విరుచుకు పడుతుంది. పెళ్లి ఆలోచ‌న త‌న‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది అన్నట్టుగా ఇలియానా రియాక్షన్ ఉంది.

మరోపక్క ఇలియానా ఫ్యామిలీ మాత్రం ఆమెకు సంబంధాలు చూస్తున్నారు. రీసెంట్ గా ఓ హిందీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇలియానా మాట్లాడుతూ.. తనకు తన పేరెంట్స్ సంబంధాలు చూడడం ఆపడం లేదు అని, తన పెళ్లి పై తన ఫ్యామిలీ చాలా ఆశలు పెట్టుకుంది అని ఇలియానా చెప్పుకొచ్చింది. ఇంత‌కీ ఇలియానా పెళ్లి పై ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ? అనే అంశంపై మాత్రం ఇలియానా స్ప‌ష్ట‌మైన స‌మాధానం ఇవ్వ‌లేదు.

కాకపోతే.. గతంలో పలువురితో నడిపిన ప్రేమ కహానీల్లో ఇలియానా బాగా ఇబ్బందులు పడింది. ఎన్నో రకాలుగా బాధ పడింది. అయినా.. ఏ ఒక్కరితో ప్రేమను ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాను అనే బాధ ఆమెను తీవ్రంగా బాధ పెడుతుందట. అయితే, పెళ్లిపై త‌ను న‌ర్వ‌స్ కావ‌డానికి కార‌ణం ప్రేమలో తాను విఫలం అవ్వడం అయితే కాద‌ని ఇలియానా కుండ‌బ‌ద్ధ‌లు కొడుతోంది. ఏది అయితే ఏం.. స్థూలంగా ఇలియానా పెళ్లిపై మాత్రం ఆస‌క్తిని చూప‌డం లేదు. మరోవైపు బాలీవుడ్, టాలీవుడ్ ల‌లో ప‌లువురు హీరోయిన్లు ఒక్కొక్క‌రుగా వివాహంతో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. అయినా ఇలియానా మాత్రం అలాంటి ఆస‌క్తినేమీ ప్ర‌ద‌ర్శించ‌డం లేదు.

ఇవి కూడా చదవండి…

నాగచైతన్య జ్ఞాపకాల్లో సమంత

‘వారసుడు’ చూసిన రామ్ చరణ్ ?

ఫిబ్రవరి 10న అమిగోస్..

- Advertisement -