ఐపీఎల్ 14లో కొత్త జట్టు..!

329
ipl 2020
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)కు విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సక్సెస్‌ ఫుల్‌గా 13 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకోగా 5 సార్లు ముంబై ఛాంపియన్‌గా నిలిచింది. 13వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై విజేతగా నిలిచింది.

ఇక ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించి ఆసక్తిర వార్త వినిపిస్తోంది. ఇప్పటివరకు 8 జట్లు ఐపీఎల్‌కు ప్రాతినిధ్యం వహించగా తాజాగా గుజరాత్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్‌. అహ్మదాబాద్‌ బేస్డ్‌గా ఏర్పాటయ్యే కొత్త ఫ్రాంచైజీని కొనుగోలుచేయడానికి ఓ కార్పొరేట్ దిగ్గజం సిద్ధంగా కూడా ఉందని సమాచారం. ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది.

కొత్త జట్టు ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మెగా వేలానికి బీసీసీఐ సన్నద్ధం అవుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో పూర్తి స్థాయిలో వేలం జరగనుందని ఫ్రాంచైజీలకు బోర్డు సంకేతాలిచ్చింది. గుజరాత్ క్రికెట్ సంఘం అహ్మదాబాద్‌లో 1.10 లక్షల సిట్టింగ్ కెపాసిటీతో మొతేరా స్టేడియాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

- Advertisement -