ఐపీఎల్ 2021…ఫైనల్స్‌కు చెన్నై

85
csk

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా ఫైనల్‌కు చేరుకుంది చెన్నై. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీని మట్టికరిపించి తొలి జట్టుగా ఫైనల్స్‌కు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది ధోని సేన. ఢిల్లీ విధించిన 174 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6 వికెట్లు కొల్పోయయి చేధించింది.

రుతురాజ్ గైక్వాడ్ 70, రాబిన్ ఊత‌ప్ప 63 ప‌రుగులు చేసి రాణించారు. చివ‌రి ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా ధోనీ వ‌రుస‌గా మూడు ఫోర్లు కొట్టి జ‌ట్టును గెలిపించారు. శుక్ర‌వారం జ‌రిగే మ్యాచ్‌లో ఫైన‌ల్స్‌లో చెన్నై ఆడ‌నుంది.

సోమ‌వారం జ‌రిగే ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ (ఆర్సీబీ).. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డుతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందే జ‌ట్టుతో ఢిల్లీ రెండో క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌లో తలపడనుంది.