మరింత కఠినంగా యో-యో టెస్టు!

225
bcci
- Advertisement -

భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రధానంగా దృష్టి సారించిన బీసీసీఐ యో-యో టెస్టును మరింత కఠినంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. టీమిండియా తరపున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలంటే ఏ ఆటగాడైనా యో-యో ఫిట్ నెస్ టెస్టులో పాస్‌ కావాల్సిందే.

ఇప్పటివరకు ఏడాదికి ఒకసారి మత్రమే ఫిట్ నెస్ టెస్టు నిర్వహిస్తుండగా ఇకపై మూడుసార్లు నిర్వహించనున్నారు. అలాగే ఫిట్ నెస్‌ టెస్టులో 17.1 పాయింట్లు సాధిస్తే చాలు..ఇకపై దీంతో పాటు ఓ ఫాస్ట్ బౌలర్ 2 కిమీ దూరాన్ని 8 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాలి. అదే ఓ బ్యాట్స్‌మెన్‌ అయితే 8 నిమిషాల 30 సెకన్లలో పరుగు పెట్టాలి. ఏడాదిలో మూడు సార్లు ఈ టెస్టుని ఆటగాళ్లు పూర్తి చేయాల్సి ఉంటుందట. త్వరలోనే బీసీసీఐ ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్‌ని విడుదల చేయనుంది.

- Advertisement -