BB6..రేవంత్‌పై నాగ్ ప్రశంసలు

64
BB6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా నాలుగోవారం పూర్తికావడానికి వచ్చింది. ఇక నాలుగోవారం వీకెండ్‌లో భాగంగా ఇంటి సభ్యులతో మాట్లాడి ఉత్సాహపర్చారు. కెప్టెన్ గా బాగా పని చేస్తున్నావని రేవంత్ కి కితాబిచ్చారు. అయితే రేవంత్ మాత్రం కెప్టెన్సీ చాలా కష్టం అని తెలిపారు.

ఇక తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులని జంటలుగా విడగొట్టి ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ చెప్పాలన్నారు.తొలుత వారిలో వారినే డిసైడ్ అవ్వాలని కోరారు. మొదట సూర్య, ఇనయాలని బోన్ లలో నిలబెట్టగా సూర్య తానూ హిట్ అని, ఇనయా ఫ్లాప్ అని చెప్పాడు. కంటెస్టెంట్స్ కూడా ఇదే అనడంతో సూర్య హిట్ అని తేల్చేశారు నాగ్. .

ఆ తర్వాత బోన్ లోకి ఆదిరెడ్డి, గీతూ వెళ్లగా ఆదిరెడ్డి హిట్ అని చెప్పారు సభ్యులు. చంటి, సుదీప బోన్ లోకి వెళ్లగా చంటి తనని తానే ఫ్లాప్ గా చెప్పుకోవడంతో సుదీప హిట్ అని డిసైడ్ అయిపోయింది. అర్జున్, వాసంతి బోన్ లోకి వెళ్ళగా శ్రీసత్యతో కలిసి ట్రయాంగల్ స్టోరీ గురించి నాగార్జున మాట్లాడటంతో అందరూ నవ్వేశారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో చంటి, బాలాదిత్య, ఫైమా, వాసంతి, అర్జున్, ఇనయ, ఆదిరెడ్డి, మరీనా ఉండగా ఆదిరెడ్డి, ఆ తర్వాత ఫైమా, ఆ తర్వాత బాలాదిత్యని సేఫ్ చేశారు. ఇక ఈ వారం ఇంటి నుండి ఎవరు బయటకు వస్తారనేది సస్పెన్స్‌గా మారింది.

- Advertisement -