మీడియాపై చిరు అసహనం

73
chiru
- Advertisement -

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. ఆచార్య ఫ్లాప్‌ను గాడ్‌ ఫాదర్‌తో చెరిపేశారు చిరు. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో మాట్లాడిన చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

తన కెరీర్ అత్యత్తమ 15 చిత్రాల్లో గాడ్ ఫాదర్ ఒకటని తెలిపారు. ఇంద్ర, ఠాగూర్ తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించందని ప్రేక్షకులు చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారనేదానికి గాడ్ ఫాదర్ సక్సెస్ నిదర్శనం అన్నారు. ఈ సినిమాకు ఎవరు డబ్బుల కోసం పనిచేయలేదు. సక్సెస్ కోసం పనిచేశామన్నారు. కొన్ని మీడియా సంస్థలు ఈ సినిమాపై లేని పోని అపోహలు సృష్టించాయన్నారు. ఈ సినిమా కోసం ఒక ఫ్రెండ్‌గా పారితోషకం లేకుండా నటించడం ఆయన గొప్పతనాననికీ నిదర్శనమన్నారు.

ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 40 కోట్ల షేర్ (రూ. 70 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది.

- Advertisement -