రామోజీ ఫిల్మ్‌సిటీలో బీబీ3

42
nbk

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్‌ కాంబో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బిబి3 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇవాళ ప్రారంభంకానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈషూటింగ్‌లో హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి పాల్గొననున్నారు బాలయ్య.

తొలుత ఈ సినిమాలో తెలుగు అమ్మాయి అంజలి, మలయాళీ భామ ప్రయాగ మార్టిన్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బాలయ్యతో కంచె భామ ప్రగ్యా జైస్వాల్ పేరును ఫైనల్ చేశారు నిర్మాతలు.

రామోజీ ఫిలిం సిటీలో జరిగే షూటింగ్‌లో బాలయ్య-ప్రగ్యాపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో సాయేషా, పూర్ణలు నటిస్తున్నారు. బోయపాటి-బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.