ఆచార్య సెట్స్‌లో సోనూ సూద్‌కు సన్మానం…

41
sonu sood

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్ ఇటీవలె ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు సోనూ సూద్.

శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా ఆచార్య సెట్స్‌లో సోనూ సూద్‌కు ఘనంగా సన్మానం చేశారు సినీ నటుడు తనికెళ్ళ భరణి. కరోనా,లాక్ డౌన్ సమయంలో పేదవారికి అండగా నిలిచి తనవంతు సాయం అందించారు. ముఖ్యంగా మైగ్రేట్స్ తమ స్వస్థలాలకు చేరడంలో కీరోల్ పోషించారు.

చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోనూ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.