తిరుపతి ప్రచారానికి బండి..నోటాతో పోటీకే అంటున్న వైసీపీ!

62
kodali

నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానంతో పాటు తిరుపతి ఎంపీ స్ధానానికి ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కోలాహలం నెలకొనగా తిరుపతి ఎంపీ స్థానానికి జనసేన మద్దతుతో బీజేపీ నుండి రత్నప్రభ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు.

ఒకటి రెండు రోజుల పాటు తిరుపతిలో పర్యటించనున్న బండి… ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగే ర్యాలీలో కూడా బండి సంజయ్ పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే తిరుపతిలో ఎవరూ ప్రచారానికి వచ్చినా వైసీపీ 5 లక్షల మెజార్టీతో గెలవడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

తిరుమల శ్రీవారి దయతో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఐదు లక్షల మెజారిటీతో వైసీపీ విజయం సాధిస్తుందని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఒక జాతీయ పార్టీ నోటాతో పోటీ పడుతుంటే.. ప్రతిపక్షం టీడీపీ డిపాజిట్‌ దక్కితేచాలని భావిస్తోందని ఎద్దేవా చేశారు.