వకీల్ సాబ్‌కు షాకిచ్చిన పోలీసులు..!

252
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం వకీల్ సాబ్. విజువల్ ట్రీట్‌గా సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 24 గంటల్లో 25 మిలియన్‌ వ్యూస్ సాధించగా 1 మిలియన్ లైక్స్‌తో యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.

ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ కానుండగా ప్రీ రిలీజ్ వేడుకను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయితే వారికి పోలీసులు షాకిచ్చారు. ఏప్రిల్ 3న యూసుఫ్‌గూడలోని పోలీసు బెటాలియన్ మైదానంలో ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించాలన్న చిత్రయూనిట్ ఆశలపై నీళ్లు చల్లారు పోలీసులు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రీ రిలీజ్‌ వేడుకలకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చిచెప్పారు.

దాదాపు మూడేళ్ల తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ‘వకీల్ సాబ్’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ వకీల్‌ (లాయర్)గా కనిపిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

- Advertisement -