సాగర్ వైపు కన్నెత్తి చూడని బండి..!

47
bandi

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. కారు పార్టీ అభ్యర్ధి నోముల భగత్ ప్రచారానికి విశేష స్పందన వస్తోండగా మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి ప్రచారాన్ని ముందుకునడిపిస్తున్నారు. అయితే ప్రచారానికి పట్టుమని పదిరోజులు కూడా లేదు. కాంగ్రెస్,బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు.

ముఖ్యంగా బీజేపీ అభ్యర్ధి రవికుమార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించే వారు కరువయ్యారు. ఒక్కడే తనకు తోచిన ఫీట్లు వేస్తూ ఏడూస్తూ,డ్యాన్స్‌లు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ప్రజల నుండి అంతగా స్పందన రావడం లేదు. కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి , పార్టీ అధ్యక్షుడు బండి సంజ‌య్ క్యాంపెయిన్ సంగతమేమో కానీ సాగర్ ఉప ఎన్నికల ఉసే ఎత్తడం లేదు.

దీంతో అసలే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో ఢీలా పడ్డ కాషాయ నేతలు, సాగర్‌ ఉప ఎన్నికలను పట్టించుకోక పోవడంతో స్థానిక కార్యకర్తలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఇప్పటికే బీజేపీకి డిపాజిట్ దక్కుతుందా లేదా అన్న సందేహలను వ్యక్తం చేస్తుండగా మరికొంతమంది కమలం నేతలు గతంలో వచ్చిన ఓట్లు 2 వేలు కూడా వచ్చే ఛాన్స్ లేదని చెబుతుండటం కొసమెరుపు. మొత్తంగా సాగర్ ఎన్నికలను బండి బ్యాచ్ లైట్ తీసుకోవడంతో కొంతమంది సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారట.