పాక్‌తో కఠినంగా వ్యవహరించాలి-దత్తాత్రేయ

205
Bandaru Dattatreya
- Advertisement -

జైషే మహమ్మద్ అనే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో మరణించిన సీఆర్‌పిఎఫ్ జవాన్లకు నివాళులర్పిస్తూ ఎంపి మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఈ రోజు హైదరాబాద్ లోని రాంనగర్‌లో బీజేపీ కార్యకర్తలు మరియు స్కూల్ విద్యార్థినీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా శ్రీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ: జైషే మహమ్మద్ అనే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో సీ ఆర్ పి ఎఫ్ జవాన్లకు 40 మంది మరణించారు. ఈ దాడి పట్ల యావత్తు 130 నూట ముప్పై కోట్ల మంది ప్రజల గుండె రగిలిపోతున్నదని, భారత దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు సరైనటువంటి గుణపాఠం చెప్పడమే దీనికి సమాధానం అని ప్రజలు భావిస్తున్నారు. పాకిస్తాన్‌తో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌ని ఏకాకిని చేయడం. ఇంకా అంతర్జాతీయంగా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని, దీనికి భారత ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది పేర్కొన్నారు.

Bandaru Dattatreya

ఈరోజు జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని సింగ్లావ్‌లో ఉగ్రవాదుల కోసం తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతాదళాలు దాడికి సూత్రధారులైన రషీద్ ఘాజీ మరియు ఖమ్రాన్‌లను మట్టుబెట్టడం జరిగిందని, ఎదురు కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులపై తమ ప్రాణాలను సైతం లెక్క జేయక ఉగ్రవాదులను ఎదుర్కొన్న సైనికులను బండారు దత్తాత్రేయ ప్రశంసిచారు.

ఈ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో కాశ్మీర్ ప్రజలందరూ సహకరించాలని కోరారు. కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన సి ఆర్ పి ఎఫ్ జవాన్లకు నివాళులర్పిస్తూ, దేశ రక్షణకు అహర్నిశలు కృషిచేస్తున్న వీర జవాన్లకు మద్దతుగా దేశంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు కలిసి వచ్చి త్రివర్ణ పతాకం చేతబట్టి కులాలకు మతాలకు అతీతంగా ర్యాలీలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు.

- Advertisement -