ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య షాకింగ్ కామెంట్స్!

40
nbk

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్నదానిపై తనకు బాధ లేదంటూనే అతని రాకతో పార్టీకి నష్టం ఏర్పడితే ఏం చేస్తారని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ తెలుగు దేశంలోకి రావాలి, పార్టీ ప‌గ్గాలు తీసుకోవాల‌ని చాలామంది అంటున్నారు.ఎవ‌రి ఇష్టాఇష్టాలు వాళ్ల‌వి. వాళ్ళ ఇష్టాన్ని బ‌ట్టే మాట్లాడ‌తారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తాడా? రాడా అన్న దాని గురించి నేను బాధపడటం లేదని తెలిపారు. సినిమాలలో ఉన్న రామారావు సీఎం అయ్యారుగా అని అన్నీ అవ్వాలంటే కావు. తెలుగుదేశం పార్టీ ఒక ఆవేశంలో నుంచి పుట్టింది.. అంతేతప్ప వేరే విధంగా రాలేదన్నారు.

ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే తెలుగుదేశం బలపడుతుందని.. ముఖ్యంగా యువతలో చైతన్యం వస్తుందని టీడీపీ కార్యకర్తలు భావిస్తుండగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.