నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ 2 కి సంబంధించి కొత్త అప్ డేట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకి రాబోతున్నడనేది న్యూ అప్ డేట్. ఆహా టీంతో పాటు నిర్మాత నాగ వంశీ కూడా పవన్ పేరు చెప్పకుండా ఓ హింట్ ఇచ్చేశారు. ప్రస్తుతం అన్ స్టాపబుల్ 2 ప్రభాస్ ఎపిసోడ్ కోసం అందరూ చూస్తున్నారు. ప్రభాస్ ఎపిసోడ్ కి సంబంధించి గ్లిమ్స్ తో ఆహా ఊరిస్తుంది. అంతలోనే పవన్ తో ఓ ఎపిసోడ్ అంటూ ఫ్యాన్స్ లో కూడా జోష్ నింపింది.
బాలయ్య టాక్ షోలో చాలా విషయాలు బయటికొస్తున్నాయి. ప్రభాస్ ఎపిసోడ్ లో కూడా కొత్త విషయాలు బయటికి రానున్నాయని ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ పెళ్లి గురించి ఓ క్లారిటీ ఉందనుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బాలయ్య షో కి పవన్ వస్తే ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారు ? ఇందులో రాజకీయాల గురించి కచ్చితంగా టాపిక్ ఉంటుంది కాబట్టి పవన్ ను బాలయ్య జనసేన పార్టీ , పోలిటిక్స్ గురించి ఏం అడుగుతాడు ? దానికి పవన్ ఎలాంటి సమాధానం ఇస్తాడు ? అసలు ఉన్నపళంగా బాలయ్య పవన్ తో ఎందుకు ఈ ఎపిసోడ్ చేస్తున్నట్టు? దీని వెనుక ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా ? అని రాజకీయ పరంగా కూడా చర్చనీయాంశం అవుతుంది.
పవన్ తో బాలయ్య ఎపిసోడ్ ఈ నెల 27న షూట్ జరగనుంది. పవన్ తో దర్శకుడు క్రిష్ కూడా రానున్నాడని ఇన్సైడ్ టాక్. సో హరి హర వీరమల్లు విశేషాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ సీజన్ 2 ముగుస్తుందని టాక్. ఈ ఎపిసోడ్ ను సంక్రాంతి కి రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి…