కత్రినా…2022 మోస్ట్‌ సెర్చ్‌డ్ వుమెన్‌

284
- Advertisement -

గూగుల్‌ విడుదల చేసిన మోస్ట్‌ సెర్చ్‌డ్ ఆసియన్స్‌ వరల్డ్ వైడ్ 2022 జాబితాలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ టాప్‌లో నిలిచింది. ఈ యేడాది గూగుల్‌ లో అత్యధికంగా శోధించిన ఆసియన్ల జాబితాలో కత్రినా 4వ స్థానంలో ఉంది. కాగా ఆలియా భట్‌ 5వ స్థానంలో ఉంది. ఈ యేడాది భారతీయ నటీనటులో కత్రినా ఆగ్రస్థానంలో నిలిచింది. సినిమా రంగం నుంచి కాకుండా మూడవ స్థానంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచారు. అయితే మొదటి స్థానంలో దక్షిణకొరియా బ్యాండ్ సభ్యులు తేహ్యూంగ్ మొదటి స్థానంలో ఉండగా జుంగూకూక్‌ రెండవ స్థానంలో ఉన్నారు.

కత్రినా కైఫ్ ఇటీవలే సిద్ధాంత్ చతుర్వేది ఇషాన్‌ ఖట్టర్‌లతో కలిసి హార్రర్ కామెడీ ఫోన్‌ భూత్‌ సినిమాలో నటించింది. తదుపరి చిత్రంగా 2023 దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వస్తున్న టైగర్ 3వభాగంలో నటించనుంది. యశ్‌రాజ్‌ఫిల్మ్స్‌ నిర్మించనుండగా సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్నారు. దక్షిణ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతితో కలిసి మెర్రీ క్రిస్మస్ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు ఫర్హాన్‌ అక్తర్ సినిమా అయిన జీలే జరా సినిమాలో అలియా భట్‌ ప్రియాంక చోప్రాతో కలిసి సందడి చేయనున్నారు.

ఇవి కూడా చదవండి…

ఢిల్లీ ఘటన కలిచివేసింది:కంగనా

కన్నీళ్లు పెట్టుకున్నా వదల్లేదు

బాలయ్య కోసం మరో ముద్దుగుమ్మ‌

- Advertisement -