Nani:’బలగం’ వేణుతో నాని సినిమా..!

52
- Advertisement -

నేచురల్ స్టార్ నాని నటించిన ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా నాని ఎక్స్(ట్విట్టర్) ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని.. ‘కొత్త దర్శకుల్లో మీరు ఎవరితో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు’ అని ప్రశ్నించగా.. ‘బలగం వేణు’ అని బదులిచ్చారు. దీంతో వేణుతో నాని సినిమా చేయబోతున్నాడనే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే, వేణుతో నాని సినిమా ఇంకా ఫిక్స్ కాలేదు. ఒకవేళ వేణు మంచి కథతో నాని దగ్గరకు వెళ్తే.. కచ్చితంగా నాని బలగం వేణుతో సినిమా చెయ్యొచ్చు.

ప్రస్తుతానికి అయితే నాని తన హాయ్ నాన్న‌ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అన్నట్టు ఇందులో శృతి హాస‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ బ‌జ్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంద‌ని, అందులో భాగంగా వ‌చ్చే స‌న్నివేశాల్లో నాని- శృతి మ‌ధ్య ల‌వ్‌స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంద‌ని, వీరి ల‌వ్‌ స్టోరీ చాలా విషాద‌క‌రంగా ఉంటుంద‌ని కూడా తెలుస్తోంది. మొత్తానికి హాయ్ నాన్న‌ రిలీజ్ దగ్గర పడేకొద్దీ.. ఆ సినిమా పై ఇంట్రెస్టింగ్ బ‌జ్ ను పెంచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.

పనిలో పనిగా నాని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ట్విట్టర్‌లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన నానిని ఓ అభిమాని తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి తన అభిప్రాయం చెప్పాలని అన్నారు. దానికి నాని.. ‘10 ఏళ్లు బ్లాక్ బస్టర్ సినిమా చూశాం. థియేటర్‌లో సినిమా మారింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం’ అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ, నాని తన హాయ్ నాన్నతో బ్లాక్ బస్టర్ కొడతాడా ? లేదా ? అనేది ఈ వారం తేలిపోనుంది.

Also Read:Congress:ఛలో ఢిల్లీ..సీఎం లొల్లి?

- Advertisement -