‘బాహుబలి’ ఫీవర్‌..ఇంకా వదల్లేదు..!

95
#bahubali2 hashtag on Twitter

‘బాహుబలి’ ఫీవర్‌ బాక్సాఫీస్ నే కాదు.. సోష‌ల్ మీడియాని సైతం వదల్లేదు. ‘బాహుబలి ది బిగినింగ్’ లో ఉన్న సస్పెన్స్‌తో ‘బాహుబ‌లి 2’ రికార్డుల మోత మోగింది. తెలుగు సినిమా ఖ్యాతి పెంచిన ‘బాహుబలి’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.

 #bahubali2 hashtag on Twitter

తాజాగా ట్విట్ట‌ర్ ఇండియా విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం 2017లో భార‌త‌దేశంలో వినోదం కేట‌గిరీలో ‘బాహుబ‌లి 2’ సినిమా టాప్ ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌గా నిలిచింది. ఆ త‌ర్వాతి స్థానంలో హిందీ ‘బిగ్‌బాస్ సీజ‌న్ 11’, మూడో స్థానంలో ‘మెర్స‌ల్’ చిత్రం నిలిచాయి. టాప్ 3లో రెండు ద‌క్షిణ భార‌త సినిమాలు ఉండ‌టం నిజంగా గ‌ర్వ‌కార‌ణం.

ఇక వార్తలు, రాజ‌కీయాల కేట‌గిరీలో ‘దివాలీ’, ‘జీఎస్టీ’, ‘మ‌న్ కీ బాత్’ ట్యాగ్‌లు ముందంజ‌లో ఉన్నాయి. క్రీడ‌ల కేట‌గిరీలో ‘ఛాంపియ‌న్స్ ట్రోఫీ 17’, ‘ఇండియా వ‌ర్సెస్ పాక్‌’, ‘ఐపీఎల్‌’, ‘డ‌బ్ల్యూడబ్ల్యూసీ 17’ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్న‌ట్లు ట్విట్ట‌ర్ ఇండియా ట్వీట్ చేసింది. మొత్తానికి ఓ తెలుగు సినిమా అయిన ‘బాహుబలి’కి సోషల్‌ మీడియా సైతం ఫిదా అయిపోయిందన్న మాట.