రాజరికమా..?..ప్రజస్వామ్యమా..?:పవన్‌

195
- Advertisement -

ఏ కులానికో మతానికో చెందిన పార్టీ జనసేన కాదని…జాతీయ బావాలున్న పార్టీలు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ . విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టిస్తోన్న ప‌వ‌న్   జనసేన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొని మాట్లాడారు. తండ్రి సీఎం అయితే కొడుకు సీఎం కావాలన్న ఆలోచనే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.పాలకుడు అవినీతి పరుడైతే పరిపాలన సజావుగా సాగదని అందుకే జగన్‌కు మద్దతివ్వలేదని చెప్పారు. సంకల్పం ఉంటే  ఏదైనా సాధ్యమేనని తెలిపారు.

పీఆర్పీ ద్వారా రాజకీయ విప్లవం జరగనందుకు బాధగా ఉందన్నారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవికి ద్రోహం చేసిన వారికి చెంపపెట్టులా జనసేన ఉండాలన్నారు.తాను వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పులు చేయ‌లేక‌పోవ‌చ్చు కానీ, కొంత‌యినా మార్చుతామ‌ని అన్నారు. తన‌కు రాజకీయాల్లోకి రావాల‌ని ఉంద‌ని 2003లో త‌న‌ అమ్మానాన్న‌ల‌కి చెప్పానని  కానీ రాలేకపోయానని కనీసం 2007లోనైనా రాజకీయాల్లోకి వస్తే రాటుదేలేవాడినని చెప్పుకొచ్చారు.

మనిషిలో పరిపూర్ణమైన మంచితనం ఎక్కడా ఉండదని రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి..చెడు రెండు ఉన్నాయని తెలిపారు. తాను బీజేపీ, టీడీపీ ప‌క్షం కాదని ప్ర‌జ‌ల ప‌క్షం అని అన్నారు.తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది ఏదో సాధించ‌డానికి కాదని… త‌న‌ మ‌న‌స్సాక్షికి స‌మాధానం చెప్పుకునేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చానని చెప్పారు. తన‌కు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, స‌ర్దార్ ప‌టేల్, నెహ్రూ, అంబేద్క‌ర్  స్ఫూర్తి అని అన్నారు. మ‌న ఆలోచ‌న‌లు వేరు వేరుగా ఉండొచ్చని, లోప‌ల త‌ప‌న మాత్రం ఒకటే ఉంటుందని అన్నారు.

జ‌గ‌మంత కుటుంబం మ‌న‌ది, వ‌సుదైక కుటుంబం అని ఆయ‌న చెప్పుకొచ్చారు.  దేశ రాజ‌కీయాల‌కు కొత్త రక్తం కావాలని అన్నారు. మారాల‌ని  చెబితే ఎవ్వ‌రూ మార‌రని, మ‌నం మంచి దారిలో న‌డిచి చూపిస్తే మ‌న‌ల్ని చూసి మార‌తారని అన్నారు.

- Advertisement -