ఒకే సినిమాలో బిగినింగ్.. కంక్లూజన్‌కు సన్నాహాలు !

234
'Bahubali' to Have New International Version
- Advertisement -

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినీరంగ చరిత్రలో మరే చిత్రానికీ సాధ్యం కాని మహాద్బుతాన్ని రాజమౌళి తీసిన బాహుహలి2 సృష్టించింది. విజువ‌ల్ వండ‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 1500 కోట్ల మార్కుని చేరుకుంది. దేశంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన బాహుబలి:ది కన్‌క్లూజన్‌ అన్ని భాషల్లోను రికార్డులను తిరగరాస్తూ విజయవంతంగా దూసుకుపోతోంది. ట్రైలర్‌గా వచ్చిన బాహుబలి: ది బిగినింగ్‌తోనే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

baahubali-2-759

ఇక అసలు సినిమా అంతా రెండవ పార్టులో ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా.. దీంతో కేవలం మూడు వారాల్లోనే రూ. 1500 కోట్లు సాధించి భారతీయ సినీ చరిత్రలో రికార్డులు తిరగరాసింది. అయితే బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు సగలు ప్రేక్షకుడి మదిలో మెదలుతున్నాయి. ఇపుడు ఆ ఆలోచనలు బాహుబలి నిర్మాతలకు కూడా వచ్చిందట. అంతే కాదు ఈ సినిమాను ఇంగ్లీష్ వెర్షన్‌లో కూడా రిలీజ్ చేయబోతున్నారట.

baahubali-31

‘బాహుబలి’ రెండు భాగాల్ని కలిపి ఒక సినిమాగా కుదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘బాహుబలి: ది బిగినింగ్’ను.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ను కలిపి ఒక ఇంటర్నేషనల్ వెర్షన్‌ కోసం కసరత్తులు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. దాదాపు 5 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న రెండు భాగాల్ని రెండున్నర గంటల నిడివికి తగ్గించబోతున్నారట.

big_455746_1493382362

అంతర్జాతీయ స్థాయిలో పేరు మోసిన ఎడిటర్ల సాయంతో ఈ వెర్షన్ ను ఇంగ్లిష్ లోకి అనువాదం చేసి.. దాన్ని పలు దేశాల్లో రిలీజ్ చేస్తారట. ఇప్పటికే ‘బాహుబలి’ రెండు భాగాలు విడుదలైన దేశాలతో పాటు మరిన్ని దేశాల్లో బాహుబలి ఇంగ్లిష్ వెర్షన్ రిలీజవుతుందని సమాచారం. రెండు భాగాల్లోని పాటలతో పాటు అనవసరం అనుకున్న కొన్ని సన్నివేశాల్ని తీసేసి.. ఈ ఏడాది ఇంగ్లిష్ ‘బాహుబలి’ విడుదల చేయడానికి బాహుబలి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే బాహుబలి రికార్డుల్ని తిరగరాసే మరో సినిమా రావడానికి ఇంకో 20 నుంచి 30 ఏళ్లైనా పట్టోచ్చు..

- Advertisement -