పఠాన్ బంపరాఫర్.. రిజల్ట్ ఎలా ఉంటుందో?

13
- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లెటెస్ట్ సెన్సెషన్ ‘పఠాన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ.. తాజాగా హిందీ లాంగ్వెజ్‌లో ఏకంగా రూ.511 కోట్లు సాధించి బాహుబలి-2(రూ.510 కోట్లు) రికార్డును బ్రేక్ చేసింది. దీంతో హిందీ లాంగ్వెజ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ‘పఠాన్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది.

అయితే, ‘పఠాన్’ బాక్స్‌ఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ .. బుక్ మై షోలో సినిమా టికెట్‌ను బుక్ చేసే వారికి బంపరాఫర్ ప్రకటించింది. ఈ సినిమాను PATHAAN ప్రొమో కోడ్‌‌తో ఎవరైతే ముందుగా టికెట్ బుక్ చేసుకుంటారో వారికి మరో టికెట్ ఉచితంగా ఇస్తామని తెలిపింది. ఈ ఆఫర్ మార్చి 3 – 5 వరకు ఉంటుందని పేర్కొంది.

మొత్తమ్మీద పఠాన్ మేకర్స్.. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్ పై లక్నోలో FIR నమోదైన సంగతి తెలిసిందే. గౌరీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కంపెనీ డబ్బులు తీసుకుని కూడా ప్లాట్ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూ ముంబైకి చెందిన జస్వంత్ షా ఫిర్యాదు చేశారు. గౌరీఖాన్ ఈ కేసు పై ఇంతవరకు స్పందించలేదు.

ఇవి కూడా చదవండి…

ఆ బ్యూటీ ఎన్టీఆర్ ను పట్టేసింది!

గోపిచంద్‌@31వ సినిమా…

కాబోయే భార్య ఫోటోను షేర్ చేసిన మనోజ్‌..

- Advertisement -