ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండవ భాగం బాహుబలి: ది కన్‌క్లూజన్’ విజువల్ వండర్ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టిక్కెట్లు ఎప్పుడెప్పుడు దొరుకుతాయా.. అంటూ భాషలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా బాహుబలి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే బాహుబలి : ది కన్‌క్లూజన్ టిక్కెట్లు తొందరగా దొరకాలంటే మాత్రం ‘బాహుబలి: ది బిగినింగ్ సినిమాని మరోసారి చూడాలని నిర్మాతలు కండీషన్లు పెట్టారు. అయితే అది ఐదు రాష్ట్రాలకు వర్తించదు. ఈ ఆఫర్ కేవలం ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రమే.
ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టి విజయ ఢంకా మోగించిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 7 నుంచి 17వరకూ ‘బాహుబలి 1’ థియేటర్లలో సందడి చేయనుంది. హిందీ వెర్షన్‌ను ధర్మా ప్రొడక్షన్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. తొలిభాగం టికెట్లు కొనుగోలు చేసిన వారికి రెండో భాగం టికెట్‌పై హామీ ఇచ్చారు. అదీ హిందీ వెర్షన్‌కు మాత్రమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ ఆఫర్ వర్తించదు. మిగిలిన అన్ని షరతులూ వర్తిస్తాయని ధర్మా ప్రొడక్షన్స్ పేర్కొంది.హిందీ వెర్షన్ ‘బాహుబలి: ది బిగినింగ్’ను రేపు దేశవ్యాప్తంగా 900 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. మొత్తంగా 1000 థీయోటర్లలో బాహుబలి:ది బిగినింగ్ ను విడుదల చేయాలని రాజమౌళీ టీం భావిస్తోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ థియేటర్ల సంఖ్య మరింత పెరిగేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో హిట్‌గా దూసుకుపోతున్న సినిమా ఏదీ లేకపోవడం బాహుబలికి కలిసి వచ్చే అంశంగా మారింది. అలా మళ్లీ ‘బాహుబలి: ది బిగినింగ్’ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కావడం విశేషం. రెండో భాగం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ఏప్రిల్ 28న రాబోతోన్న తరుణంలో తొలి భాగాన్ని విడుదల చేయడం చక్కటి వ్యూహం. ఇది సరిగా పనిచేస్తే.. విజయం సాధించిన ఇతర చిత్రాలకూ ఆహ్వానం పలకవచ్చు.