తెలంగాణ రాష్ట్రం పచ్చదనంగా ఉండాలి: వినోద్‌

677
B vinod kumar
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాష్ట్రమంతా పచ్చగా ఉండాలని హరితహారం కార్యక్రమం మొదలు పెట్టారని,రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సీఎంఓ ఓఎస్డి రాష్ట్ర హరితహారం ప్రత్యేక అధికారిని ప్రియాంక వర్గీస్‌తో కలిసి ఆయన పర్యటించారు. కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామంలో గల గుట్ట ప్రాంతాలను వారు పరిశీలించారు. గ్రామంలో గల నర్సరీనీ పరిశీలించి అధికారుల పనితీరును కొనియాడారు.

ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. నాగారం గ్రామంలో గల రాముని గుట్ట, పెద్దగుట్ట,పొట్టిగుట్ట ప్రాంతాలలో హరితహారం కార్యక్రమం ద్వారా అడవులను పునరుద్ధరణ చేస్తామన్నారు. శ్రీ కోదండరామ స్వామి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. గుట్టల చుట్టూ పశువులు రాకుండా కంచెలు నాటి,ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆశయం మేరకు ఈ వర్షాకాలంలో మొక్కలు నాటి అడవులను పునరుద్ధరణ చేస్తామన్నారు.

vinod kumar

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం పచ్చదనం గా ఉండాలని ఆకాంక్షిస్తున్నారని, ఈ వర్షాకాలం ప్రారంభమైన క్రమంలో మండలం మొత్తం మొక్కలు నాటి కోనరావుపేట మండలాన్ని కోనసీమగా తీర్చిదిద్దాలన్నారు. కోనరావుపేట మండలం చాలా వెనుకబడిన ప్రాంతమని ఇక్కడ వర్షాభావం కూడా తక్కువగా ఉంటుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాజరాజేశ్వర జలాశయం,మల్కపేట రిజర్వాయర్ ద్వారా కోనరావుపేట మండలం సస్యశ్యామలం అవుతుందన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా మండల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండేదని, కొన్ని కారణాల వల్ల పచ్చదనం కోల్పోయిన రాజన్న సిరిసిల్ల జిల్లాని మళ్లీ పచ్చని జిల్లాగా మార్చడానికి కలెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లా అటవీశాఖ అధికారి ఆశ సూక్ష్మంగా కృషి చేస్తున్నారన్నారు. స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు,మంత్రి కెటి రామారావు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడానికి పాటు పడుతున్నారన్నారు.ఈ కార్యక్రమానికి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు సహకరించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -