మెల్బోర్న్‌లో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు..

335
Bathukamma celebration
- Advertisement -

ఆస్ట్రేలియా మెల్బోర్న్‌లో బతుకమ్మ ఉత్సవాలు ATAI ( ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్) ఆధ్వర్యములో,కమ్మని తెలంగా విందుతో కనుల పండుగగా జరిగాయి. సుమారు మూడు వేల మంది అథితులు హాజరైన ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు, బతుకమ్మ పాటలకు పెట్టింది పేరు అయిన భోలే షావలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తను సంగీత దర్శకత్వంలో సమకూర్చిన కోలో కోలో కోల్, ఆకుపచ్చ పండగొచ్చెనే చెల్లెలా బతుకమ్మ పాటలతో ఎంతో ఉత్సాహంగా ఆడ పడచులతో ఆడి పాడారు.

Bathukamma celebration

ఈ ఉత్సవాలకు హాజరైన పలు భారతీయ అసోసియేషన్ ప్రతినిధులను అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి అత్తాపురం, ఉపాధ్యక్షులు అనిల్ బైరెడ్డి సన్మానించారు. ఎల్లప్పుడూ ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలతో మన సంస్క్రుతి సాంప్రదాయాలను కాపాడటానికి క్రుషి చేద్దామన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మలు తెచ్చిన ప్రతి ఒక్కరికి వెండి నాణెములు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బతుకమ్మలకు బంగారు నాణెములు మరియు మరెన్నో ఇతర బహుమతులు ఇచ్చారు. ATAI ఈ సంవత్సరం కూడా తెలంగాణ వంటకాలు డబల్కా మీట, గవ్వలు, సకినాలు, సర్వపిండి, పచ్చి పులుసులతో వడ్డించిన విందు భోజనం వచ్చిన ఆహుతలందరికీ స్వదేశాన్ని గుర్తు చేసిందన్నారు.

కార్యక్రమానికి సెక్రెటరి రఘు కోట్ల వందన సమర్పణ చేస్తూ, ఈ కార్యక్రమం ఇంత విజయ వంతం కావటానికి స్పాన్సర్స్, కమూనిటీ పార్ట్నర్స్, మీడియా పార్ట్నర్స్, వాలెంటీర్స్, అడ్వయిజరీ బోర్డు సభ్యులు, రాజవర్దన్ వుల్పాల, పుల్లారెడ్డి బద్దం, ప్రవీణ్ దేశం, క్రిష్న వడియాల, శ్యాం లింగంపల్లి మరియు సంస్త సభ్యులు కిషోర్ యన్నం, దీపక్ హరి, రవి దామెర, కిరణ్ పాల్వాయి, ఫణి రంగరాజు, వంశీ కొట్టాల, మహేశ్ బద్దం, సతీష్ పాటిలు చేసిన క్రుషి కారణమన్నారు. శ్రీ మురళి బుడిగె, యాంకర్ మధులికకు, మరియు ఈ సంసవత్సరం వేదికను ఎంతో ఆకర్షణీయంగా మలిచిన శిరీష, సుష్మిత, నిశిత, అక్షితలను అభినందించారు.

- Advertisement -