మూడో రోజు బతుకమ్మ ప్రత్యేకత ఇదే..

26
- Advertisement -

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సెలబ్రేషన్స్ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదిరోజులు తొమ్మిది రకాల పేర్లతో బతుకమ్మ సంబరాలు జరుపుకోనుండగా మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ ఆటలు ఆడిన మహిళలు, రెండోరోజు అటుకుల బతుకమ్మను ఘనంగా నిర్వహించుకున్నారు.

తొమ్మిది రోజులలో గౌరమ్మకు రకరకాల నైవేద్యాలు పెడుతూ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రధానంగా మూడో రోజు ప్రసాదంగా ముద్దపప్పు, పాలు, బెల్లంతో ప్రసాదం తయారు చేసి సమర్పిస్తారు. అందుకే మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ అనే పేరు వచ్చింది.

ఏ పేరుతో పిలుచుకుని పూజించినా..ఏ నైవేద్యాలు సమర్పించినా పూలదే ప్రధాన పాత్ర. ప్రతిరోజు బతుకమ్మను పేర్చేందుకు తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు, బంతి, మల్లె, చామంతి, సంపెంగ, గులాబీ, రుద్రాక్షలు, సీత జడలు వంటి రకరకాల పూలతో పేరుస్తారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ఈ ఉత్సవం ముగియనుండగా బతుకమ్మను గంగమ్మలో నిమజ్జనం చేస్తారు.

Also Read:చిరస్ధాయిగా నిలిచే..’భగవంత్ కేసరి’

- Advertisement -