సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హలో గురు ప్రేమ కోసమే’..

251
Hello Guru Prema Kosame
- Advertisement -

ఎనర్జిటిక్ హీరో రామ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

Hello Guru Prema Kosame

ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా ‘యూ’ సర్టిఫికెట్ ని జారీ చేశారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.

- Advertisement -