టీడీపీ కుప్పకూలుతుంది:వేణుస్వామి

125
astro guru Venu swamy prediction on Ap Cabinet

వేణు స్వామి… తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు, తాజా రాజకీయ పరిణామాలను తనదైన విశ్లేషణతో దానికి జ్యోతిష్యం జోడించి సంచలనం సృష్టించడంలో సిద్దహస్తులు. జయలలిత మరణం దగ్గరినుంచి అఖిల్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ వరకు ఆయన చెప్పిన జ్యోతిష్యం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

లోకేష్ ఎంట్రీతోనే టీడీపీకి ఇబ్బందులు మొదలయ్యాయని చెప్పిన ఆయన తాజాగా మరో బాంబు పేల్చాడు. ఏపీ మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన ముహుర్తం సరిగా లేదని….ఏ పండితులు ఇలాంటివి పెట్టరని ఎందుకు ఇలాంటి ముహుర్తాన్ని ఎంచుకున్నారో అర్దం కావడం లేదన్నారు. వారు పెట్టిన ముహుర్తం చండీలంగా ఉందని దీనివల్ల లగ్నంలో చంద్రుడు, అష్టమ స్ధానంలో శని ఉన్నారని ఈ కారణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఈ ముహుర్తం నాయకుల మానసిక స్ధితిపై దెబ్బ కొడుతుందని చెప్పారు.

చాలా మంది నాయకులు అలిగారని, కొంతమంది అసలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికే రాలేదని ఇవన్నింటికి కారణం ముహుర్త సమయం సరిగాలేనందుకేనని తెలిపారు. దీనివల్ల కుళ్లు, కుతంత్రాలు పార్టీలో విపరీతంగా పెరిగిపోతాయని …. ముందు మంచిగా కనిపించే నేతలు తర్వాత అదును చూసి దెబ్బకొడతారని తెలిపారు. టీడీపీ కూప్పకూలే పరిస్ధితి వస్తుందని తెలిపారు.

ఇక గతంలో  లోకేష్‌ వల్ల టీడీపీకి ఇబ్బందులు తప్పవని చెప్పి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. లోకేష్‌తో టీడీపీకి అరిష్టమని … భూమా నాగిరెడ్డి  చనిపోవడం వంటి పరిణామాలన్నీ లోకేష్ గ్రహస్థితి కారణంగానే జరుగుతున్నాయని వేణుస్వామి వివరించారు. లోకేష్ జాతకంలో అష్టమ దశ శని ప్రభావం కొనసాగుతోందని.. ఆయన వల్ల పార్టీకి నేతలకు చాలా ఇబ్బందులు రానున్నాయని గతంలో  తెలిపారు.