- Advertisement -
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు అస్ట్రాజెనికా ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా మే 7న వ్యాక్సిన్ ఉపసంహరణకు అనుమతి లభించింది. త్వరలోనే కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా టీకాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఆస్ట్రాజెనికా ప్రకటించింది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల తమకు అరుదైన వ్యాధులు వచ్చాయంటూ పలువురు పిటిషన్లు వేశారు. యూకేలో 81 మంది ప్రాణాలు కోల్పోయారని.. వారి కుటుంబసభ్యులు వందల కోట్లు డిమాండ్ చేస్తూ కేసులు వేశారు.
ఈ టీకా వేసుకునేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదు. అందుకే టీకాను వాపస్ తీసుకుంది ఆస్ట్రాజెనెకా. భవిష్యత్‌లో కోవిషీల్డ్‌పై న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
Also Read:స్నేహం, జీవితాలకు సంబంధించిన కథే.. ‘కృష్ణమ్మ’
- Advertisement -