ఏషియన్ సినిమాస్‌కు ‘సవారీ’ రైట్స్‌..!

317
savaari movie

నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన సవారీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ మరియు ప్రొడక్షన్ సంస్థ ఏషియన్ సినిమాస్ సవారీ సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు. నైజాంలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది.

సవారీ చిత్రంలోని పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాహుల్ సిప్లిగంజ్ పాడిన నీ కన్నులు లిరికల్ సాంగ్ 3 మిలియన్ వ్యూస్ దక్కించుకుని.. ఇంకా వ్యూస్ తెస్తూనే ఉంది. సాహిత్ మోత్కూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మించారు.

savaari

శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఇక ఇప్పుడు ఏషియన్ సినిమాస్ నైజాం రైట్స్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలో విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు చిత్ర యూనిట్. నటీనటులు: నందు, ప్రియాంక శర్మ, శ్రీకాంత్ గంట, శివ, మది తదితరులు.