స్వప్న సినిమా నుండి ఇటీవల విడుదలైన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడానికి ముందు మ్యూజికల్ హిట్స్. ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలు పోషించిన మరో మ్యూజికల్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’ తో వస్తున్నారు. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వాసుకి ఇతరులు ముఖ్య తారాగణం.
మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఈరోజు, ఫోర్త్ సింగిల్- చెయ్యి చెయ్యి కలిపేద్దాం ను విడుదల చేసారు. ఇది పెళ్లి వేడుక. మిక్కీ జే మేయర్ ఆహ్లాదకరమైన వెంటనే కనెక్ట్ అయ్యే సిట్యుయేషనల్ ట్రాక్ ని స్కోర్ చేసారు. వివాహ వేడుకలు ఎలా ఉంటాయో, ఎలాంటి సన్నాహాలు జరుగుతాయో చంద్రబోస్ సరిగ్గా వివరించారు. ఇది ప్రధానంగా వివాహ విందు గురించిన పాట. శ్రీ కృష్ణ, వేణు శ్రీరంగం, సందీప్, చైత్ర అంబడిపూడి వాయిస్ లు మరింత ప్రత్యేకతను చాటాయి. నటీనటులందరూ కలిసి ఈ వేడుకను జరుపుకోవడం ఒక కన్నుల పండుగ. ఈ పాటకు బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.సాంగ్ లాంచ్ ఈవెంట్ లో కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. నా సినిమాలకి హీరోయిన్ ముఖ్యం. అందుకే ముందు హీరోయిన్ గురించే మాట్లాడతా. (నవ్వుతూ) ఈ సినిమా లో హీరోయిన్ చాలా అందంగా వుంది. సంతోష్ శోభన్ కి అల్ ది బెస్ట్. నందిని, స్వప్న, ప్రియాంక .. ముగ్గురూ తెలివైన వాళ్ళు. దత్ గారి బ్యానర్ లో దాదాపు 14 సినిమాలు తీశాను. దాదాపు అన్నీ హిట్స్. రాజ కుమారుడితో మహేష్ బాబు, స్వప్న బ్యానర్ లో ఎన్టీఆర్, అలాగే ముగ్గురం కలసి అల్లు అర్జున్ ని పరిచయం చేశాం. ఈ ముగ్గురిని డైరెక్ట్ చేసేవారు వస్తే బావుంటుందని ప్లాన్ చేసి నన్ను ఈ ఈవెంట్ కి పిలిచినట్లు అనిపిస్తుంది(నవ్వుతూ). కాబట్టి అన్నీ మంచి శకునములే. ఈ పాట చూసినప్పుడు పెళ్లి సందడి చూసినంత ఆనందం కలిగింది. పెళ్లి సందడి అంత పెద్ద విజయం ఈ సినిమా సాధిస్తుంది’’ అన్నారు.
Also Read:ఆదిపురుష్ ట్రైలర్ కి టైమ్ లాక్
అల్లు అరవింద్ మాట్లాడుతూ..దత్ గారు, రాఘవేంద్రరావు గారితో ముఫ్ఫై ఏళ్ళు పై బడిన స్నేహం. ఎప్పుడు కలసి ఆనందంగా నవ్వుకుంటాం. స్వప్న, ప్రియాంక నా కూతుళ్ళు లాంటి వారు. నేను దత్తు గారు యాభై ఏళ్ళుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ ఇవాళ మా పిల్లలు వలన ఇంకా ఎక్కువ షైన్ అవుతున్నాం. నందిని రెడ్డితో జాగింగ్ ఫ్రండ్షిప్ (నవ్వుతూ). సినిమాలు కంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. చిన్న సినిమాక్ కూడా ఎక్కువ ఖర్చు చేయడం దత్ కి అలవాటు. మహానటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూసి దత్ ని తిట్టాను( నవ్వూతూ) తర్వాత సినిమా కూడా అలానే చేశారు. అయితే అన్నీ మంచి లాభాలు తీసుకొచ్చాయి. ఈ చిత్రానికి కూడ ఎక్కువ ఖర్చుపెట్టారని తెలుసు. ఇది కూడా లాభాలు తెచ్చిపెడుతుంది. ఆ కళ కనిపిస్తోంది. సినిమా చాలా హాయిగా వస్తుందనిపిస్తుంది. మనందరికీ హాయి ఇస్తుందనే నమ్మకం వుంది, నిర్మాతలకు, నందినికి, హీరో హీరోయిన్లు అందరికీ హాయిని ఇస్తుంది’’ అన్నారు.
అశ్వినీదత్ మాట్లాడుతూ.. నా జీవితంలో మర్చిపోలేని వేడుక ఇది. 49 ఏళ్ల క్రితం సినిమా తీద్దామని విజయవాడ నుంచి బయలుదేరితే నవయుగ ఫిలిమ్స్ వారు మద్రాస్ లో అల్లు రామలింగయ్యగారి అబ్బాయి అరవింద్ తో స్నేహం చేయి, నీకు అంత సక్సెస్ ఫుల్ గా ఉంటుందని చెప్పారు( నవ్వుతూ) ఇక్కడికి వచ్చిన తర్వాత అరవింద్ గారితో, రాఘవేంద్రరావు గారితో గొప్ప స్నేహం ఏర్పడింది. చాలా ఏళ్ల స్నేహం తర్వాత పెళ్లి సందడి చేసాం. కోటి ఇరవై లక్షలతో సినిమా చేస్తే 14 కోట్లు పే చేసింది. మేమే విడుదల చేశాం, మేమే పంచుకున్నాం. అరవింద్ గారు ,నేను కలసి హిందీ సినిమా చేశాం. దిని కంటే ఎక్కువ పోయింది. అయితే లాభం వచ్చినప్పుడు పొంగిపోలేదు, నష్టం కలిగినప్పుడు క్రుంగిపోలేదు. ఎప్పుడూ ఒకేలా వున్నాం. స్వప్న సినిమా, సినీ మీడియా, రాఘవేంద్ర మూవీ మీద మేము ముగ్గురం ఎన్నో గొప్ప సినిమాలు తీశాం. నా సినిమాలు కంటే వాళ్ళ సినిమాల వంక చూసినప్పుడే ఎక్కువ గర్వంగా వుంటుంది’’ అన్నారు.
నందినీ రెడ్డి మాట్లాడుతూ.. నేను పరిశ్రమలోకి వచ్చిన తర్వాత రాఘవేంద్రరావు గారు , అల్లు అరవింద్ గారు , అశ్వనీదత్ గారు.. ఈ ముగ్గురికి కలసి కథ చెప్పడం నా అదృష్టం.ఈ ముగ్గురు నాకు మంచి శకునం. ఈ ముగ్గురు ఒకేచోట నిలబడి సినిమా గురించి మాట్లాడం ఆనందంగా వుంది’’ అన్నారు. ప్రియాంక దత్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ముగ్గురిని చూస్తూ పెరిగాం. ఇలా ముగ్గురిని ఒకే వేదికపై చూడటం ఆనందంగా వుంది’’ అన్నారు.
Also Read:లింగాయత్ లు బీజేపీకి షాక్ ఇస్తారా?
స్వప్న దత్ మాట్లాడుతూ.. నాన్నతో ఏదైనా సమస్య వుంటే రాఘవేంద్రరావు అంకుల్ దగ్గరికి వెళ్లి ఎలా చెప్పించాలో చూస్తాను. అది అవ్వకపొతే అరవింద్ అంకుల్ కి ఫోన్ చేసి డాడీ ని తిట్టుకుంటాను(నవ్వుతూ). మేము వాళ్ళ పిల్లల్లా పెరిగాం. వారంతా ప్రతి అడుగులో మాకు సపోర్ట్ గా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు’’ తెలిపారు.మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దావూద్ స్క్రీన్ ప్లే అందించగా, లక్ష్మీ భూపాల డైలాగ్ రైటర్. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.అన్నీ మంచి శకునములే మే 18న విడుదల కానుంది.తారాగణం: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్ తదితరులు