క్వారంటైన్‌లో అసలు ఏంజరిగిందంటే..!

142
coronavirus

ఏబీఆర్ ప్రొడక్షన్స్ మరియు జిఎస్ ఫిలిమ్స్ పతాకంపై అనిల్ బొద్దిరెడ్డి సమర్పిస్తున్న చిత్రం ‘అసలు ఏంజరిగిందంటే’. మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రదాన పాత్రదారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ బండారి దర్శకత్వం వహించగా, అనిల్ బొద్దిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేసింది. సక్సెస్‌ఫుల్‌గా నెలరోజుల క్వారెంటైన్‌ను పూర్తిచేసుకున్నామని తెలిపింది. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని తద్వారా ఒక్కపాజిటివ్ కేసు కూడా నమోదుకాకుండా చూస్తామన్నారు.

సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ పొందగా త్వరలో విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు.