పంచాయతీలకు ఇంటర్నెట్‌: మోడీ

281
modi
- Advertisement -

దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోడీ..ఈ-గ్రామ స్వరాజ్‌పోర్టల్‌ను ప్రారంభించారు.

అనంతరం ప్రధాని మాట్లాడుతూ గ్రామాల్లో సుపరిపాలన కోసం పంచాయతీ రాజ్‌ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కరోనా కట్టడికి తమవంతు కృషి చేస్తున్న అందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. స్వీయ నిర్భందంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.

ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, ఇతరులపై మనం ఆధారపడకూడదని, స్వయం సంవృద్థి సాధించాలని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో విద్యుత్‌, రహదారులు, పారిశుద్ధ‍్యంపై చర్యలు చేపట్టాలని, అలాగే కరోనా వైరస్‌ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని సూచించారు.

- Advertisement -