వైద్య శాఖకు 313పోస్టులు మంజూరు..

47
- Advertisement -

ఆరోగ్య తెలంగాణ లక్ష్యమే ద్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం…తాజాగా ఆరోగ్య కళాశాలలకు 313పోస్టులను మంజూరు చేసింది. ఈయేడాది ఏర్పాటు చేయనున్న 9మెడికల్ కాలేజీలకు ఈ పోస్టులను మంజూరు చేసింది. క్లీనికల్ నాన్‌క్లినికల్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల సృష్టికి అనుమతించింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే కాలంలో సీఎం కేసీఆర్ ఆన్‌లైన్ ద్వారా మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజన్న సిరిసిల్ల కామారెడ్డి వికారాబాద్ ఖమ్మం కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి కొమురంభీం ఆసిఫాబాద్ జనగామ నిర్మల్‌ జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన బడ్జెట్‌లో నిధులనూ కేటాయించింది. అయితే ఈ మెడికల్ కాలేజీలకు 313పోస్టులను మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి…

ముగిసిన గ్రూప్-4 దరఖాస్తులు…

నోనిపండు తింటే.. అనారోగ్య సమస్యలన్నీ పరార్ !

” సింహగర్జనసనం” వేస్తే ఎన్ని ఉపయోగాలో..!

- Advertisement -