రివ్యూ: అరవింద సమేత

313
aravinda sametha review
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మూవీ ఫస్ట్ లుక్‌,టీజర్‌,ట్రైలర్‌లతో దసరాకు సందడి చేసేందుకు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌ వెండితెర‌పై ఎలా ఉంది? వీర రాఘ‌వుడిగా ఎన్టీఆర్ విశ్వ‌రూపం చూపించారా? లేదా అన్నది చూద్దాం..

కథ:

ఫ్యాక్షన్‌ గొడవల్లో తండ్రి(నాగాబాబు)ని కొల్పోతాడు వీరరాఘవ(ఎన్టీఆర్). నాయనమ్మ(సుప్రియ పాతక్‌)సూచనతో హింస,రక్తపాతానికి దూరంగా ఉండేందుకు హైదరాబాద్ వెళ్లిపోతాడు. అక్కడ అరవింద(పూజా హెగ్డే) పరిచయం అవుతుంది. అనుకోకుండా ఓ సారి అరవిందపై దాడి జరుగుతుంది. ఆ ప్రమాదం నుంచి అరవిందను రక్షిస్తాడు వీరరాఘవ. సీన్ కట్ చేస్తే తర్వాత ఏం జరుగుతుంది..?అసలు అరవింద ఎవరు..?హింస,ఫ్యాక్షనిజాన్ని ఎన్టీఆర్ ఎలా అడ్డుకున్నాడు అన్నది తెరమీద చూడాల్సిందే.

Image result for aravinda sametha

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ ఎన్టీఆర్‌ న‌ట‌న‌, త్రివిక్ర‌మ్ మాటలు, గుండెను హ‌త్తుకునే స‌న్నివేశాలు. ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. తన పాత్రకు నూటయాభై శాతం న్యాయం చేశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గత సినిమాల్లో చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సినిమాకు తన అందంతో మరింత గ్లామర్ తెచ్చింది పూజా హెగ్డే. ఇక బాలిరెడ్డిగా జగపతిబాబు
ఒదిగిపోయారు. విలన్‌ అంటే ఇలా ఉంటాడా అనేలా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. సినిమాలో ఎంచుకున్న ప్రతిపాత్ర కథతో ముడిపడేలా త్రివిక్రమ్ తన మార్క్ చూపించారు. నీలాంబ‌రిగా సునీల్ ఆక‌ట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మైజర్ మైనస్ పాయింట్స్ కామెడీ లేక పోవడం,రన్ టైమ్. ప్రీ క్లైమాక్స్ కాస్త‌ సాగ‌దీసిన‌ట్లు అనిపించినా, క్లైమాక్స్‌లో మ‌ళ్లీ క‌థ‌ను ఫామ్‌లోకి తీసుకొచ్చారు త్రివిక్రమ్. త్రివిక్ర‌మ్ సినిమాలకు ప్రధాన బలం కామెడీ. అయితే ఈ సినిమాలో మాటల మాంత్రికుడి మార్క్ కామెడీ కొరవడింది. రన్ టైం కాస్త ఎక్కువ‌గా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. త‌మ‌న్ అందించిన సంగీతం సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లింది. నేపథ్య సంగీతం విషయంలో తమన్ వంద శాతం న్యాయం చేశారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్. ఎన్టీఆర్‌ను చూపించిన తీరు, యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కించిన విధానం ఆక‌ట్టుకుంటాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for aravinda sametha

తీర్పు:

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక అరవింద సమేతతో నెరవేరింది. కథ,ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా కామెడీ లేకపోవడం మైనస్ పాయింట్స్. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకుని కథ ద్వారా తాను ఏం చెప్పదల్చుకున్నాడో చెప్పగలిగాడు త్రివిక్రమ్‌. ఓవరాల్‌గా త‌న శైలికి భిన్న‌మైన క‌థ‌ను ఎంచుకుని దసరాకు ప్రేక్షకులను మెప్పించగలిగారు త్రివిక్రమ్-ఎన్టీఆర్.

విడుదల తేదీ:11/10/2018
రేటింగ్:3.25/5
న‌టీన‌టులు: ఎన్టీఆర్‌, పూజాహెగ్డే
సంగీతం: త‌మ‌న్‌
నిర్మాత‌: ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు)
ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్

- Advertisement -