అమెరికాలో సత్తా చాటుతున్న “వీర రాఘవ”

202
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత వీరరాఘవ.  ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే వీర రాఘవ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. పాజిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

యూఎస్ లో ప్రీమియర్ షోలతో కలిసి తొలిరోజు వసూళ్లలో ఎన్టీఆర్ గత సినిమా రికార్డులను బ్రేక్ చేసింది వీరరాఘవ. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జైలవకుశ తొలిరోజు 5,89,219 డాలర్లు,జనతా గ్యారేజ్ 5,84,000 డాలర్లను రాబట్టింది.

యూఎస్ లో 194 సెంటర్లలో రిలీజైన వీరరాఘవ ఈ రెండు సినిమాలను బీట్ చేస్తూ 7,07,698 డాలర్లను రాబట్టింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం,త్రి విక్రమ్ మాటలు,ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దసరాకు ముందే ఫ్యాన్స్ కు పండగనిచ్చిన ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా పూజా హెగ్డే నటించగా జగపతిబాబు,నాగబాబు కీలక పాత్రలు పోషించారు.

- Advertisement -