గంధం ఉత్సవాల్లో పాల్గొన్న ఏఆర్ రెహమాన్..

187
- Advertisement -

కడప జిల్లా కేంద్రంలోని ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా పవిత్ర గంధం మహోత్సవాన్ని దర్గా ప్రతినిధులు వైభవంగా నిర్వహించారు. ఈ గంధం వేడుకల్లో సంగీత మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్ పాల్గొన్నారు.

అనంతరం దర్గా పీఠాధిపతి అరిఫులా హుస్సేని గాంధాన్ని తీసుకుని వచ్చి దర్గాలో మాజర్ల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తూ ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ బాష, ఇతర తమిళనాడు చెందిన సినీనటి టిడిపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి. ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.

- Advertisement -