ఏఆర్‌ రెహ్మాన్‌కు ఊరట..

46
rahman

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ కు ఊరట లభించింది. రెహ్మాన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్ట్‌ సరైన ఆధారాలు కొట్టేసింది. 2000లో ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత విభావరిని నిర్వహించగా ఈ మ్యూజికల్‌ ఈవెంట్‌కి సంగీత ప్రియులు ఆశించిన స్థాయిలో హాజరు కాలేదు. కనీసం ఖర్చు చేసిన డబ్బు కూడా రాలేదని, రెహ్మాన్‌ మాత్రం లబ్ది పొందారని మద్రాస్‌ హైకోర్ట్ లో నిర్వాహకుడు కాలియప్పన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికిగానూ నష్టపరిహారంగా 3 కోట్లు చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

నిర్వాహకుడికి లాభం రాకపోవడానికి తమకి ఎలాంటి సంబంధం లేదని….లాభం లేదని చెబుతూ నిర్వాహకుడు తమకి ఇస్తానని ఒప్పుకున్న డబ్బు కూడా ఇవ్వలేదని న్యాయస్థానానికి వివరించారు రెహ్మాన్‌ తరఫు లాయర్‌ .దీనిపై పిటిషన్‌ తరఫు న్యాయవాది సరైన వివరణ ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి ఈ కేసుని కొట్టేశారు.