త్వరలో పీ. సుశీల బయోపిక్..!

61
susheela

తన బయోపిక్ తీయాల్సిందిగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్‌ను కోరారు లెజెండరీ సింగర్ పి. సుశీల. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు రెహ్మాన్‌. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 99 సాంగ్స్” మూవీ చూసారా ? అని అడిగాను. ఒకవేళ ఇంకా సినిమాను చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో చూడమని చెప్పాను. ఆ సమయంలో పక్కనే ఉన్న ఆమె సోదరుడికి ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో సుశీలమ్మకు చూపించమని రిక్వెస్ట్ చేశాను.

సినిమా చూసిన తరువాత సుశీలమ్మ నన్ను పిలిచి మా బృందాన్ని మెచ్చుకున్నారు. తన బయోపిక్‌ను “99 సాంగ్స్” చిత్రంలా చేయమని ఆమె నన్ను కోరింది అని తెలిపారు.

99 సాంగ్స్ చిత్రంతో స్క్రీన్ రైటర్‌గా మారారు. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. “99 సాంగ్స్”లో ఇహన్ భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు వెర్షన్లు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, జియో సినిమాల్లో ప్రసారం అవుతున్నాయి.