ఏపీ పాలిటిక్స్ అండోయ్.. అలాగే ఉంటాయ్!

42
- Advertisement -

రాజకీయాలకు సినిమాలకు అభినవ సంబంధం ఉంటుందనే సంగతి జగమెరిగిన సత్యం. సినీ రంగంనుంచి రాజకీయ రంగప్రవేశం చేసి చరిత్రలో నిలిచిన నేతలు చాలానే ఉన్నారు. వారంతా కూడా సినిమాను వినోదంగాను రాజకీయాన్ని ప్రజా సేవగా భావించి ప్రజల మన్ననలు పొందారు. కానీ నేటి రోజుల్లో పోలిటికల్ లీడర్లే రాజకీయాల్లో వినోదాన్ని పంచుతు కొత్త తరం రాజకీయాలకు నాంది పలుకుతున్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన చోట, అనవసరమైన విషయలను తెరపైకి తీసుకురావడం, ప్రజా అభివృద్ది గురించి గళమెత్తాల్సిన చోట వ్యక్తిగత విమర్శలకు దిగడం, అసలు రాజకీయాలంటే ప్రబుత్వ ప్రత్యర్థి పార్టీల నేతలు ఒకరినొకరు తిట్టుకోవడం తప్పా మరోటి కాదనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడం..ఇదే ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ లో నడుస్తున్న ట్రెండ్.

అది అసెంబ్లీ అయిన, ప్రెస్ మీట్ అయిన ఎక్కడైనా తిట్టుకోవడం, విమర్శించడం తప్పా.. అభివృద్ది గురించి మాట్లాడడం, సమస్యలను ప్రస్తావించడం తమా ఎజెండా కాదని నిరూపిస్తున్నారు ఏపీ పోలిటికల్ లీడర్స్. గత కొన్నాళ్లుగా జనసేన మరియు వైసీపీ పార్టీల మద్య చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనిస్తే పై విధమైన అభిప్రాయాలు కలుగక మానవు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. అధికార పార్టీ నేతలు మాత్రం కేవలం పవన్ ను విమర్శించడానికే ప్రెస్ మీట్లు పెట్టడం నిజంగా ఆశ్చర్యమే. ఇంతకీ విషయమేమిటంటే గత కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా పై ఏపీలో రాజకీయ వివాదం నడుస్తోంది. బ్రో మూవీలో తనను కించపరిచే విధంగా ఒక క్యారెక్టర్ ఉందని ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు.. ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే బ్రో మూవీలో ఏ క్యారెక్టర్ ఎవరిని ఉద్దేసింది చేసినవి కాదని అటు వైపు నుంచి చిత్రయూనిట్ చెబుతోంది. ఈ నేపథ్యంలో పవన్ను ఉద్దేశించి ” మూడు ముళ్ళు ఆరు పెళ్లిళ్లు, నిత్య పెళ్లి కొడుకు దత్త పుత్రుడు..వంటి సినిమాలు తీస్తామని అంబటి ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. అంబటి కి కౌంటర్ గా ” ఇంట్లో సుకన్య- వీధిలో సంజన, గంట అరగంట, కాంబాబు రాసలీలలు.. ” వంటి సినిమాలు తీస్తున్నామని జనసేన నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. అయితే ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి తాన శాఖకు సంబంధించి, పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏనాడూ ప్రెస్ మీట్ పెట్టని ఆయన కేవలం పవన్ను విమర్శించేందుకే గంటల ప్రెస్ మీట్ పెట్టడం..వేరే ఇంకేమి సమస్యలు లేవన్నట్లుగా పవన్ ను మాత్రమే టార్గెట్ చేయడం వంటి పరిణామాలు చూస్తున్న సామాన్యులు.. మూవీస్ కంటే ఏపీ పాలిటిక్స్ లోనే అధిక వినోదం ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

Also Read:తెలుగు హీరోలూ..ఆ హీరోని ఫాలో కాండి

- Advertisement -